మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ హెచ్చరిక

జనం న్యూస్‌ 20 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 18న వాహనదారులను హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవ్వడం లేదా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఇటువంటి వాహనదారులను కట్టడి చేసేందుకు ప్రతీ రోజూ నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగులో ప్రత్యేకంగా డ్రైవ్ చేపడుతున్నామన్నారు. మద్యం సేవించి ప్రమాదాలకు కారకులవుతున్నారన్న విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న న్యాయస్థానాలు కూడా మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయన్నారు. ఇటీవల మద్యం సేవించి పోలీసులకు పట్టుబడిన డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో సుమారు 100 మంది నిందితులను జైలుకు పంపడం జరిగిందని, కొంతమందికి జైలు శిక్షతో పాటు రూ.10వేలు చొప్పున జరిమానా కూడా విధిస్తున్నారని తెలిపారు. మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు జిల్లా పోలీసులు కౌన్సిలింగు నిర్వహించి, రహదారి ప్రమాదాలకు కారకులు కావద్దని, ప్రమాదాలకు గురవ్వదని, తమపై ఆధారపడి జీవించే భార్య, పిల్లలు, ఇతరకుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని కౌన్సిలింగు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. గత సంవత్సరం 4,650 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదుచేసామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *