జనం న్యూస్ జనవరి 20, (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ జంగల్ హనుమాన్ శ్రీ సాయి బాబా 29వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీ సాయి బాబా పల్లకి శోభయాత్ర ఖానాపూర్ పట్టణంలోని పుర వీధుల గుండా శ్రీ సాయినామ స్మరణతో భక్తుల కోలహాలనుతో బాజా భజంత్రీల నడుమ శ్రీ సాయిబాబా మందిరం నుండి పరమ పవిత్ర ఉత్తరవాహిని గౌతమి గోదావరి నది తీరం వరకు భక్తి పరవశంతోని శోభాయాత్ర కొనసాగింది గోదావరికి చేరిన తర్వాత పంచామృత అభిషేకము సాయిబాబా మూలవిరాట్ విగ్రహానికి చేయడం జరిగింది తర్వాత మహా అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ శివ సాయి జంగల్ హనుమాన్ ఆలయ కమిటీ మరియు భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.