బేరి బలరాం స్వామి, బొత్స వెంకటరమణ మృతి పట్ల వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను సంతాపం

జనం న్యూస్‌ 20 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌, బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేతల కుటుంబాలలో జరిగిన మరణాలపై విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మరియు బొబ్బిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శంభంగి చిన్న అప్పల నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల స్వగృహాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బేరి బలరాం స్వామికి నివాళులు విజయనగరం జిల్లా సోషల్ మీడియా సెక్రెటరీ బేరి బుజ్జి ప్రసాద్ (పండు) తండ్రి, రిటైర్డ్ ఎలక్ట్రికల్ లైన్మెన్ బేరి బలరాం స్వామి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మజ్జి శ్రీనివాసరావు బొబ్బిలిలోని వారి స్వగృహానికి వెళ్లి, బలరాం స్వామి చిత్రపటం వద్ద నివాళులర్పించి, బుజ్జి ప్రసాద్ మరియు కుటుంబ సభ్యులను ఓదార్చారు. బొత్స వెంకటరమణకు సంతాపం 9వ వార్డు కౌన్సిలర్ బొత్స రవణమ్మ భర్త బొత్స వెంకటరమణ కూడా ఇటీవల మృతి చెందారు. శ్రీనివాసరావు వారి ఇంటికి వెళ్లి రవణమ్మ మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీకి విధేయంగా పనిచేసే కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో శంభంగి వేణు, బొబ్బిలి మాజీ మున్సిపాల్ చైర్మన్ మురళీకృష్ణ, ఇంటి గోపాలరావు, కౌన్సిలర్లు బాబు, ఉమా, సత్యనారాయణ, రమేష్, రామారావు, దామోదర్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *