జనం న్యూస్ మునగాల జనవరి 20, మునగాల మండలం సీతానగరం గ్రామపంచాయతీ పరిధిలోని సీతా నగరం తండా గ్రామం నుండి సోమవారం సుమారు 50 మంది వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తలు ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని పిలుపునిచ్చినారు. రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.