బస్సువేసి మా సమస్య తీర్చండి

★యాచారం , కడ్తల్ , ఆమనగల్, మాడుగుల మండల పరిధిలోని మేడిపల్లి

జనం న్యూస్ ప్రతినిధి, 20 జనవరి 2026, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : యాచారం మండలం లోని మాల్ , మేడిపల్లి హైదరాబాద్, మేడిపల్లి మాల్ నైట్ హాల్ట్, ముద్విన్ మాల్ , మాడుగుల , మాల్ వివిధ గ్రామాలకు వచ్చే బస్సులను కల్వకుర్తి డిపో అధికారులు కరోనా సమయంలో రద్దు చేశారు. ఆ బస్సును పునర్ ప్రారంభం చేయాలని పలుమార్లు కల్వకుర్తి డిపో మేనేజర్ కి ,ర్ ఎం కు మరియు కల్వకుర్తి ఎమ్మెల్యే కి ఆర్టీసీ ఎండీకి గతంలో వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదు డిపో మేనేజర్ కుంటి సాకులు చెబుతూ కాలం గడుపుతూ వచ్చింది. మరో మారు సోమవారం కల్వకుర్తి డిపో సూపర్ డెంటికీ బస్సు సమస్యలపై విన్నర్ పత్రము అందజేయడం జరిగింది డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో సూపర్డెంట్ కి పి ర్ జి ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరు రవీందర్ గుప్తా కల్వకుర్తి డిపోలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ గుప్తా మాట్లాడుతూ త్వరలో బస్సు సమస్యలు పరిష్కారం చేయకపోతే కల్వకుర్తి డిపోకు సంబంధించిన బస్సులను అడ్డుకుంటామని తెలిపారు.