జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ జనవరి 20 ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన జిల్లా కోర్టు ఫలితాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచి, ఉద్యోగాలు సాధించిన యువతకు రాయవరం విజ్ఞాన్ వారి విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ లో చిరు సత్కారం చేశారు. ఉద్యోగాలు సాధించిన వారిలో కుతుకులూరుకు చెందిన కర్రి సౌమ్యశ్రీ, ద్వారంపూడి దుర్గా వెంకటేశ్వర రెడ్డి, తాడి మణికంఠ అజయ్ సాగర్ రెడ్డి మరియు మహేంద్రవాడకు చెందిన సబ్బెళ్ల అనసూయ తదితరులు ఉన్నారు. వీరందరూ డిగ్రీ చదువుతున్నప్పటి నుండే పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడం జరిగిందని, అందుకే అతిచిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం జరిగిందని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి తెలిపారు. వీరు ప్రస్తుత యువతకు ఆదర్శనీయమని ఆయన అన్నారు. వీరికి శిక్షణ అందించిన టిఎస్ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా తమ కళాశాలలో కూడా ఇంటర్ మరియు డిగ్రీతో పాటే పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని కళాశాల డైరెక్టర్ డాక్టర్ మల్లిడి శేషవేణి తెలిపారు. ఇంటర్ స్థాయిలోనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రయత్నం కొనసాగిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులభమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ మల్లిడి సతీష్ రెడ్డి, విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సబ్బెళ్ల అచ్చిరెడ్డి, విజ్ఞాన్ కాంపిటేటివ్ వింగ్ ఇంచార్జ్ డాక్టర్ తేతల సుబ్బిరెడ్డి, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ త్రివేణి మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
