ప్రజా సమస్యలకు అద్దం పట్టే ప్రజా జ్యోతి – మంత్రి జూపల్లి కృష్ణారావు

★ప్రజా జ్యోతి క్యాలెండర్ ఘన ఆవిష్కరణ

జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ అర్సి ప్రజల గళాన్ని ప్రభుత్వానికి చేరవేస్తూ, ప్రజా సమస్యలకు అద్దం పట్టే పాత్రను ప్రజా జ్యోతి పత్రిక నిర్వర్తిస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా వాంకిడి మండలం లో ప్రజా జ్యోతి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా కీలక బాధ్యత నిర్వహిస్తోందని అన్నారు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం, ప్రజల బాధలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడమే నిజమైన జర్నలిజమని పేర్కొన్నారు. ఆ బాధ్యతను ప్రజా జ్యోతి పత్రిక నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అంశాల వరకు ప్రజా జ్యోతి నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వార్తలను ప్రచురిస్తోందని తెలిపారు. సామాజిక స్పృహ, ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఈ పత్రిక కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం మీడియా మరింత బలంగా నిలవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజా జ్యోతి క్యాలెండర్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమైన తేదీలు, పండుగలు, సామాజిక సందేశాలతో రూపొందించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్యాలెండర్ ప్రజలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి సతీష్ గౌడ్ ఆసిఫాబాద్ అర్సి సురేష్ ఆసిఫాబాద్ టౌన్ తిరుపతి వాంకిడి ప్రతినిధి భీమ్ రావు అరుణ్ జర్నలిస్టులు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజా ప్రయోజనాలను కాపాడే ప్రజా జ్యోతి ప్రయాణం ఇలాగే కొనసాగాలని పలువురు అభినందించారు.