నూతన సర్పంచులు, ఉపసర్పంచులకు ఘన సన్మానం

*ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై 20 నుంచి కాంగ్రెస్ ఉద్యమం: ఆత్రం సుగుణక్క*


జనం న్యూస్ . కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: జైనూర్ మరియు సిర్పూర్-యు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులను జైనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్‌లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రజాసేవలో ముందుండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారు నూతన ప్రజాప్రతినిధులకు సుగుణక్క సూచించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి సుగుణక్క కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను సుగుణక్క వివరించారు. ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారమని, మహాత్మా గాంధీ పేరు తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి, కూలీల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్,జైనూర్,సిర్పూర్-యు మండలాల అధ్యక్షులు షేక్ ముఖిధ్,ఆత్రం గోవింద్ రావు, ఆత్రం జాలింషా, కుడిమెత యశ్వంత్, షేక్ రషీధ్, చిర్లే లక్ష్మణ్, జమీల్, పెందూర్ ప్రకాష్, వీణ బాయి,వివిధ గ్రామాల సర్పంచులు చందన్ షా, రాందాస్, గణపత్, అర్జున్, మనోహర్,ప్రతిభ, రాజేందర్, ఆత్రం అయ్యుబాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *