జనం న్యూస్ కళ్యాణదుర్గం జనవరి 20, రిపోర్టర్ ముంగ ప్రదీప్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కాటా తిమ్మప్ప అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని చెప్పిన టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కర్లకుంట రామాంజనేయులు, బ్రహ్మాసముద్రం మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, బొమ్మగానిపల్లి మాజీ సర్పంచ్ తిమ్మప్ప చౌదరి, రాజేష్, భీమలింగ, రాజేష్ తదితరులు.
