జనం న్యూస్ 20 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బండారి ఎస్ రాజ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బండారి ఎస్ రాజ్ మాట్లాడుతూ ..జిల్లాలో ఉన్న గద్వాల్,ఐజ, వడ్డేపల్లి, అలంపూర్, ఈ నాలుగు మున్సిపాలిటీలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ నుండి అన్ని స్థానాలల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనులారా ఆధిపత్య పార్టీల జెండాలు పక్కన పెట్టి ఆత్మగౌరవంతో బహుజన్ సమాజ్ పార్టీ నుండి పోటీ చేయాలని బహుజనులకు సూచించాడు, ఒకనాడు ఈ దేశ బహుజనుల కోసం జ్యోతిరావు పూలే నుండి అంబేద్కర్ వరకు ఎన్నో త్యాగాలు చేసి బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగాన్ని రచిస్తే, ఈ దేశ రాజ్యాంగన్ని అమలు చేసి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని ఉద్దేశంతో మాన్య శ్రీ కాన్షిరాం బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసాడు అని వివరించారు అన్ని స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టి వారి గెలుపునకు బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది అని అన్నారు.