జనం న్యూస్ కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: జైనూర్ మండలం జంగాం గ్రామంలో జనసేన అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి బంతికి బ్యాట్‌తో ఆడి టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో చురుకుగా పాల్గొంటూ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని, ఇలాంటి టోర్నమెంట్లు యువతకు సరైన దిశను చూపుతాయని పేర్కొన్నారు.జనసేన అసోసియేషన్ యూత్ అధ్యక్షుడు సయ్యద్ ఇర్ఫాన్ ఇటీవలే యూత్ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని సుగుణక్క అన్నారు. యువతను సమీకరించి సామాజిక బాధ్యతతో ముందుకు నడిపించే శక్తివంతమైన నాయకత్వం సయ్యద్ ఇర్ఫాన్‌కు ఉందని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాహిత కార్యక్రమాలపై నమ్మకంతో యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ రమేష్,సర్పంచ్ అనసూయ బాయి-అర్జున్,ఉపసర్పంచ్ సయ్యద్ సజద్, మండల అధ్యక్షుడు ముఖిత్,మాజీ వైస్ ఎంపీపీ చీర్లే లక్ష్మణ్,ఆత్మ కమిటీ చైర్మన్ రమేష్,మాజీ ఎంపిటిసి ఎండి అత్తర్,గెడెం గోపీచంద్,అజ్జులాల,సయ్యద్ అబ్దుల్లా, పేందూరు సంజు,సఫిక్ హైదర్,రహీం,జనసేన అసోసియేషన్ యూత్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
