జనం న్యూస్ కూడేరు జనవరి 20, రిపోర్టర్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల పరిధిలో మండల రెవెన్యూ ఆఫీసు నందు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు.
ప్రజా సమస్యల కోసం ప్రజలు తమకు సంబంధించిన అర్జీలను మండల రెవెన్యూ ఆఫీసు నందు గ్రీవెన్స్ డే లో అర్జీలు ఇవ్వడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు డుమ్మా కొడుతున్నారు. ప్రజలు తమ బాధలను అధికారులకు చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ చూస్తే అధికారులు ఎవరూ లేరు. గ్రీవెన్స్ డే అనేది ప్రజల సమస్యను తెలుసుకోవడానికి గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకా ప్రజలకు ఎప్పుడు సమస్య ఎప్పుడు తీస్తారు అధికారులు? అందులో ఓ అంగన్వాడి అధికారి గ్రీవెన్స్ డే ఆమె హాజరు కాకుండా ఒక అంగన్వాడి కార్యకర్తను గ్రీవెన్స్ డే కి పంపడం గమనహర్తం? కూడేరు మండలం రెవిన్యూ ఆఫీసు నందు గ్రీవెన్స్ లో అధికారుల హాజరు కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల రెవెన్యూ ఆఫీసు గ్రీవెన్స్ డే లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.కానీ పై అధికారులు ఎందుకు ఈ అధికారులను ప్రశ్నించడం లేదు. ఎందుకు అధికారుల పైన చర్య ఎందుకు తీసుకోలేదు, కారణం ఏమిటి అని ప్రజలు వాపోతున్నారు. అటెండెన్స్ రికార్డులో గాని సంతకాలు లేవు. ముగ్గురు అధికారులే హాజరైనట్లు సంతకాలు ఉన్నాయి.ఇప్పుడైనా ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే లో హాజరుకావాలని ప్రజలు కోరుతున్నారు.
