జనం న్యూస్ చేగుంట జనవరి 20,1.2026, మెదక్ జిల్లా చెగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు చేగుంట మండలం,చందాయిపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఆధ్వర్యంలోమొట్టమొదటి గ్రామసభ నిర్వహించారు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సంబంధిత అధికారులు పాల్గొని, గ్రామ ప్రజల నుండి వచ్చిన సమస్యలపై స్పష్టంగా, బాధ్యతతో చర్చించారు, ఈ సందర్బంగా సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సమస్యలే ప్రాధాన్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుతామని అన్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పబ్బ నగేష్ గుప్తా, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్,సి హెచ్ ఓ షైక్ అన్నీస్ ద్దీన్, ఉపాధి హామీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్, సి ఏ, లు, ఆశ వర్కర్లు, అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.