జనం న్యూస్ మధిర జనవరి 20, దోర్నాల కృష్ణ మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని గ్రామ పెద్దలు రాచకొండ వెంకటేశ్వర్లు అరుణ వారి దంపతులు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని దెందుకూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలుగా మధిర మార్కెట్ యార్డ్ వారు 30116నిలవగా రెండవ బహుమతిని 25116 దెందుకూరు అంబేద్కర్ టీం, మూడవ బహుమతిని కలకోట 20000 టీంలు గెలుపొందాయి. గెలుపొందిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతి మరియు మెమెంటోలను కీర్తిశేషులు దమ్మలపాటి దేశపతి రావురోశ మ్మ వారి దంపతుల కుమారులు కుమార్తెలు సహకారంతో రాచకొండ వెంకటేశ్వర్లు అరుణ వారి దంపతులు విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దోర్నాల దినకర బాబు పగిడిపల్లి మాధవరావు పగిడిపల్లి ప్రభాకర్. సందీప్ డేవిడ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో మొత్తం 35 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు అంబేద్కర్ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు.