కిత్తంపేట లో యువకుడు మనస్థాపం తోగడ్డి మందుతాగి ఆత్మహత్య

జనం న్యూస్ జనవరి 20 రావికమతం విలేఖరి గుమ్మడు వెంకటేశ్వరరావు, తండ్రికి తాగుడు వ్యసనం, తల్లి దండ్రులు మద్య తరచూ గొడవలు, ఇంటి పరువు వీధిన పడుతోందని మనస్తాపం చెందిన కిత్తంపేటలో కర్రి శ్రీను (20) అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొత్తకోట ఎస్.ఐ ఎం.శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు.. కిత్తంపేటకు చెందిన కర్రి రమణ, రమణమ్మ దంతులు మేకలు పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శ్రీను (20), గణేష్ (15) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీను విశాఖ ఏయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కొడుకు గణేష్ తొమ్మిదో తరగతిలో ఉన్నాడు. రమణకు తాగుడు వ్యసనం ఉంది. ఇదే విషయమై భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాగుడు. మానేయని తండ్రికి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మద్యం సేవించడం, భార్యాతో తరచూ గొడవలు పడుతూనే ఉంటారు. తల్లిదండ్రుల మద్య గొడవలతో ఇంటి పరువు వీధిన పడుతుందని శ్రీను బాదపడుతూ ఉండేవాడు. ఈనేపథ్యంలో తండ్రి తాగుడు వ్యసనం, తల్లి దండ్రుల మధ్య గొడవలతో మనస్తాపం చెందిన శ్రీను శనివారం ఉదయం కొత్తకోట వెళ్లి గడ్డి మందుకొని కూల్ డ్రింక్లో కలిపి తాగాడు. మధ్యాహ్నం ఇంటి కొచ్చాక పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించ డంతో విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జాము 4-5 గంటల మధ్యలో మృతి చెందాడు. తండ్రి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్.ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో పోస్టు మార్గం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం కిత్తంపేటకు తీసుకొచ్చి అంత్య క్రియలు నిర్వహించారు. యువకుడు మృతితో కిత్తంపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి.