కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ వీర గోవిందు

జనం న్యూస్ జనవరి 20 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జొన్నల గడ్డ వీరగోవిందు తో పాటు సీనియర్ నాయకుడు గోగుల లక్ష్మయ్య బిఆర్ఎస్ పార్టీ ని వీడి సోమవారం కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీ లను వీడి పలు పార్టీ ల నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో రత్నవరం గ్రామ మాజీ సర్పంచులు పసుపులేటి వినయ్ వర్ధన్, రామిని విజయవర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సోమ గాని రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.