కాంగ్రెస్ ఇచ్చిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసిన

*మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

జనం న్యూస్ 20 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీల యొక్క బాకీ కార్డులను నారాయణఖేడ్ పట్టణంలో ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు 62,500 చెల్లించాలని. వృద్ధులకు బీడీ కార్మికులకు నెలకు 4000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలకు ఒక్కొక్కరికి 50,000 చెల్లించాలని. దివ్యాంగులకు నెలకు 6000 రూపాయలు రెండు సంవత్సరాలకు ఒక్కొక్కరికి 50,000 చెల్లించాలని. తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి నియోజకవర్గంలో ఆడపిల్లల పెళ్లిళ్లు జరగగా తులం బంగారం ఏమో గాని కళ్యాణ లక్ష్మి చెక్కులను వారికి పిల్లలు తరువాత చెక్కులు అందిస్తున్నారని పెళ్లిళ్లు జరిగిన ప్రతి ఒక్కరికి తులం బంగారం బాకీ ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ప్రతి ఒక్క విద్యార్థికి స్కూటీ ఇవ్వకుండా మోసం చేశారు అని తెలిపారు. ఫీజు రియంబర్మెంట్ బకాయి 8,000 వేల కోట్ల రూపాయలు భాగిపడ్డారు. రైతులకు రైతు భరోసా పథకం కింద రెండు సంవత్సరాలకు ఒక లక్ష 12 వేల రూపాయలు బాకీ పడ్డారు వాటిని వింతని చెల్లించాలి. ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రెండు సంవత్సరాలకు గాను 50000 రూపాయలు బాగి పడ్డారు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలకు 24 వేల రూపాయలు బాకీ పడ్డారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ భృతి రెండు సంవత్సరాలకు 96,000 రూపాయలు బాకీ పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు వీటిని అన్నిటిని చెల్లించిన తర్వాతనే ఓటు అడగాలని ప్రజలు వారిని నిలదీయాలని తెలిపారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో నారాయణఖేడ్ పట్టణంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్ మాజీ ఎంపీటీసీ ముజామిల్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అభిషేక్ షెత్కార్, విఠల్,మాజీ కో ఆప్షన్ సభ్యులు అంబదాస్, గోపాల్,నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *