జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 30 లక్షల 3 వేల రూపాయల విలువగల చెక్కులను, మండలానికి చెందిన 5గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో మాజీ కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్ రావు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాజగోపాల్ రావు మండల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
