ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళదాం:షేక్ మతిన్

జనం న్యూస్ 20 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ క్యాంపు, రుద్రూర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను బాన్సువాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ మతీన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో ఎన్టీఆర్‌ పాత్ర మరువలేనిదన్నారు. ఎన్టీఆర్ బీసీ రిజర్వేషన్ల అమలు, పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన మహానీయుడని ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇందూరు సాయిలు, కోర్బ దత్తు, సురేష్, అనీల్, సుల్తాన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.