జనం న్యూస్, జనవరి 20, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ సోమవారం మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.సోమవారం హుజురాబాద్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంఘం మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంద్ర మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.గత రెండు సంవత్సరాలకు గాను మొత్తం రూ. 73,93,823 విలువైన చెక్కులను 553 మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన బీపీఎల్ కుటుంబాలకు మెప్మా ద్వారా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని తెలిపారు.అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, పదేళ్ల నిరీక్షణ అనంతరం రేషన్ కార్డులు అందజేశామని, ప్రతి పేదవాడికి కడుపునిండా సన్నబియ్యం అందిస్తు న్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేసిన ఆయన, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, త్వరలోనే హుజురాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతామని తెలిపారు. పేదల ప్రభుత్వమైన కాంగ్రెస్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ అధికారులు, మెప్మా అధికారులు, హుజురాబాద్ పట్టణ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత, కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.