జనం న్యూస్ 20 జనవరి సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం
మనూరు మండల పరిధిలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంజయ్ కుమార్ విషయాన్ని తెలుసుకున్న జీ ఎమ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ర్యాలమడుగు మాజీ ఎంపీటీసీ అంర్య నాయక్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి,దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు కార్తీక్, సందీప్, ప్రశాంత్, మాజీ వార్డు మెంబర్ సాయిలు,రాజు, అనిల్,రాజు,చింటూ, మోహన్, తదితరులు పాల్గొన్నారు.