అనాధ పిల్లలకు ఇల్లు కట్టిస్తున్న నెక్కొండ ఎస్సై

జనం న్యూస్ /వరంగల్ జిల్లా /నెక్కొండ మండలం: నెక్కొండ మండలం పెద్దకొరుపోలు గ్రామంలో గత ఆరు నెలల క్రితం తక్కలపల్లి ఏలియా అతని భార్య మమత ఇద్దరూ అనారోగ్యంతో చనిపోవడంతో వారి ఇద్దరు కూతుర్లు జెస్సి, నూతన శ్రీ అనాధలుగ మారారు. వారికి సొంత ఇల్లు కూడా లేదు. అప్పటినుండి వారి తాత వద్ద పెరుగుతుండగా వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న నెక్కొండ ఎస్సై మహేందర్ ఉండడానికి ఇల్లు లేదని తెలుసుకొని తన సొంత ఖర్చులతోటి రెండు గదుల ఇల్లు నిర్మించుటకు ఈరోజు ఉదయం గ్రామస్తుల సమక్షంలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీస్ అంటే ఉద్యోగ బాధ్యతే కాదు సామాజిక బాధ్యత కూడా అని చాటి చెప్పారు. చిన్నారులకు ఇల్లు కట్టిస్తున్న విషయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు అభినందిస్తూ హర్షతిరేఖాలువ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జిల్లా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలుసుకొని ఎక్స్ వేదికగా నెక్కొండ ఎస్సై మహేందర్ కి అభినందనలు తెలియజేశారు.