అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పై దుస్ప్రచారం ఆపండి…

★వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న..

జనం న్యూస్, కూడేరు జనవరి 20, రిపోర్టర్ ముంగా ప్రదీప్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై కొంతమంది పనికట్టుకుని ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక రోజు ఏదో ఒక వంకతో ఆయనను విమర్శిస్తూ ప్రజలలో అబాసపాలు చేయాలనే దురుద్దేశంతో ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని. వీటన్నిటిని కూడ అర్బన్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తక్షణమే ఇటువంటి విమర్శనాత్మక మైనటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న సూచించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటిమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ వారు ఇరువురు, అర్బన్ ప్రజలకు మంచి సేవలు అందించే నాయకుడని గుర్తించి దగ్గుబాటి ప్రసాద్,కు జరిగిన ఎన్నికలలో శాసనసభ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని.అందులో భాగంగానే ప్రజల మన్ననలు పొంది అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగిందని.అది ఓర్వలేని కొందరు ఆయన ఎమ్మెల్యేగ గెలుపొందినప్పటి నుండి, పలు రకాల సాకులు చూపుతూ ఆయనను ఏదో రకముగా విమర్శిస్తూనే ఉన్నారని. ఇది కూటమి ప్రభుత్వానికి గాని తెదేపా పార్టీకి గానీ మనుగుడకు మంచిది కాదని ఆయన మనసులోని మాట తెలియజేశారు.ఇప్పటికైన ఇటువంటి విమర్శలు చేయడం మానుకొని ప్రజలకు సేవలు అందిస్తున్న ఎమ్మెల్యేకు బాసటగ నిలవాలని, వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న విలేకరుల సమావేశం ద్వారా నాయకులను కోరారు.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న..