జనం న్యూస్,జనవరి 20, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ సోమవారం జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తన సిబ్బందితో కలిసి టౌన్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొత్తపల్లి క్రాస్ రోడ్ సమీపానికి చేరుకునే సరికి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. విలాసాగర్ గ్రామానికి చెందిన మోరే హరిబాబు (తండ్రి: రాజన్న) అనే వ్యక్తి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తన ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ ఉండగా పట్టుకొని, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.