అంగ రంగా వైభవం విశ్వ కవి యోగి వేమన విగ్రహం ఆవిష్కరణ

★జ్యోతులతో ఊరిగింపు ★పట్టణ వీధుల్లో అలరించి సాంస్కృతిక కార్యక్రమాలు ★హాజరై యంపి.బి కె. పార్థసారథి

జనం న్యూస్ జనవరి 20 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) విశ్వ కవి యోగి వేమన విగ్రహ ఆవిష్కరణ అంగ రంగా వైభవం గా నిర్వహించడం జరిగింది. వేమన 374 జయంతి పురస్కరించుకొని 600 కేజీల కాంస్య విగ్రహని పట్టణం రెడ్డి కులస్తులు ఏర్పాటు చేయగా ఆవిష్కరణ కార్యక్రమం కనుల విందుగా నిర్వహించి పట్టణ వీధుల్లో జయహో రెడ్డి అంటూ హోరెత్తించి పండగ వాతావరణం నెలకొల్పడం జరిగింది. విజయ కుమార్ పెట్రోల్ బాంక్ నుండి ప్రారంభం అయినా కార్యక్రమం మండల వ్యాప్తంగా వచ్చిన మహిళలు జ్యోతులతో ఊరిగింపుగా భజ భజంత్రి లతో తరలి రాగ విచిత్రం వేసాధారణలు యువకుల నృత్యాలు కేరింతలు పట్టణ వాసులను ఆకట్టుకున్నాయి . అనంతరం విగ్రహం వద్దకు వచ్చి విగ్రహ నికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసి నివాళులు అర్పించారు. అనంతరం హిందూ పూర్ యంపి పార్థసారథి కార్యక్రమం లో పాల్గొనగా ఆయనకు అశ్వర్థరెడ్డి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్థసారథి వేమన విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమాజ శ్రేయస్సు వేమన పద్యాలు ఏ విదంగా ఉపయోగపడతాయో వివరిస్తూ ఆయను కీర్తించారు అలాగే మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ రెడ్డి, రాప్తాడు మాజీ వై సీ పి ఎమ్మెల్లే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, చల్ల శ్రీలక్ష్మి రెడ్డి హాజరై విగ్రహానికి పూలమాలలు వేశారు.వీరిని రెడ్డి సంఘ నాయకులు ఘనంగా సన్మానం చేసారు. కార్యక్రమంనికి హాజరై న రెడ్డి కులస్తులకు అభిమానులకు భోజనలు ఏర్పటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండలానికి చెందిన యన్ ఆర్ ఐ. శేషద్రి రెడ్డి, పోతుల రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి, గంపల రమణారెడ్డి ,వేణు గోపాలరెడ్డి ,రాజారెడ్డి, వీరన్నారాయణరెడ్డి, అంజిరెడ్డి ,వెంకట రెడ్డి, హరీష్ రెడ్డి ,వెంకట రంగారెడ్డి ,సమరసింహ రెడ్డి పాటు జిల్లా వ్యాప్తంగా రెడ్డి కులస్తులు పాల్గొన్నారు.