రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ 18.1.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం దక్షిణ కాశీగా పిలువబడి శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దక్షిణ కాశీగా పిలవబడే అక్బర్ పేట- భూంపల్లి మండలంలోని కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ఆదివారం రోజున కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారినీ దర్శించుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాస అమావాస్య రోజు కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో వైభవంగా జరుపు కోవడం ఇక్కడి ఆనవాయితీ అన్నారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన మాండవ్య నదిలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయన్నారు.జాతర ముగిసే వరకు ఆలయ ప్రాంగణంలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు, పకడ్బందీగా ఉత్సవ ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ చైర్మన్ ఉషయ్యగారి రాజిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సంకేత శర్మ, కమిటీ సభ్యులు వెలుపుల యాదయ్య, పుద్దోజు ప్రభాకర్ చారి. కమటం లతా మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.