మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

★ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంక టయ్య గౌడ్

జనం న్యూస్ 19/01/2026/ కల్వకుర్తి:- వెల్దండ మండల కేంద్రానికి చెందిన బిట్టి శైలజ అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మృతురాలి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మృత దేహానికి పూలమాల వేసి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బసన్మోని శ్రీను 9 వార్డ్ మెంబర్ ముదికొండ రమేష్ 13 వార్డ్ పురుషోత్తం కాంగ్రెస్ పార్టీ సీనియరు నాయకులు కొయ్యల పుల్లయ్య గోరటి కూర్పానందం మట్ట నిరజన్ గౌడ్ మంగళగిరి బాలరాజూ గంగపోగు నరసింహ తదితరుల పాల్గొన్నారు