మూడు రోజుల విరామం.. మాంసం షాపుల వద్ద జనాల హంగామా!

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరంలోని చికెన్, మటన్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కునుమ, ముక్కనుమ పండగలు శుక్ర, శనివారాలు జరగడంతో సెంటిమెంట్తో కొనుగోలు చేయలేదు. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చికెన్, మటన్, ఫిష్ షాపుల ముందు బారులు తీరారు. నగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతోంది. కాల్చిన కోడి రూ.300, చికెన్ (స్కిన్) రూ.260, (స్కిన్ లెస్) రూ.280, రొయ్యలు రూ.300/280, చేపలు రూ.180 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.