మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కు ఘన నివాళి

జనం న్యూస్ జనవరి 19 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన వ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని గోరంట్ల లో ఘనంగా నిర్వహించారు. గోరంట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బస్టాండ్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్త కళ డైరెక్టర్ పి సోమశేఖర్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, సింగల్ విండో అధ్యక్షులు బెల్లాల చెరువు చంద్ర, రవి మోహన్, సర్పంచ్ సరోజ నాగేనాయక్, మండల నాయకులు నిమ్మల శ్రీధర్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిరుపాలు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అమర్నాథ్, కృష్ణమూర్తి యాదవ్ ,వేణుగోపాల్ రాయల్, కురుమల జయరాం, పసుపులేటి శ్రీనివాసులు, రాజారెడ్డి, వృషభ దేవుడు, చాంద్ భాషా ,తిప్పరాజు పల్లి రాజా, కురువ మహేంద్ర, గంగాధర్ నాయక్, జనసేన సురేష్, సోమశేఖర్, నాగమణి, సీనియర్ నాయకుడు చలపతి, షామీర్, నరేష్ కుమార్ యాదవ్, డీలర్ మల్లేష్, శ్రీకాంత్ యాదవ్, సలీం, హనుమన్న, శ్రీశైలం శ్రీనివాసులు, మెడికల్ స్టోర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *