భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు

జనం న్యూస్ మునగాల జనవరి 19 కూరగాయలు, నిత్యవసర ధరలు సామాన్యులకు అందనంత దూరంలో ఉండగా తాజాగా చికెన్, మటన్ గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. కోదాడ పట్టణంలో ఆదివారం కిలో చికెన్ 350 రూపాయల వరకు పలుకుతుండగా, బోన్ లెస్ చికెన్ ధర 600 వరకు చేరుకుంది. ఈ ధరలు గత వారంతో పోలిస్తే పది నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. కోదాడలో మటన్ ధర కిలో 800 రూపాయల వరకు పలుకుతుంది.