జనం న్యూస్ / గంభీరావుపేట జనవరి 19 గంభీరావుపేట మండల కేంద్రంలోని బిజెపి బూత్ నిర్మాణ అభియాన్ మండల కార్యక్రమం శనివారం రోజు గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ ఆడెపు రవీందర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మండలంలో గల బూత్ అధ్యక్షులు చురుకుదనంగా లేని దగ్గరకొత్త అధ్యక్షుడునీ ఎన్నుకోవడం అధ్యక్షులు లేని దగ్గర బూత్ కమిటీలు వేయడం తప్పనిసరి అని మేరా బూత్ - సబ్సే మజ్బూత్ ఉన్నప్పుడే ఎన్నికలు ఏవైనా భారతీయ జనతా పార్టీ గెలుపే సాధ్యం అవుతుందని పార్టీని మరింత పటిష్టం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొంటూ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సర్పంచులు బండ సుకన్య దేవయ్య పొన్నాల మహేష్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ పత్తి స్వామి నర్సింలు డాక్టర్ సత్యనారాయణ సర్వోత్తమ్ కృష్ణ కాంత్ రాజు మహేష్ దుర్గేష్ దేవేందర్ యాదవ్ నర్సింలు బాలయ్య రాజిరెడ్డి దేవరాజు రాకేష్ నారాయణ ఎల్లం రవీందర్ శ్రీనివాస్ చారి చంద్రం యాదవ్ రాజు రవీందర్ నాయక్ సాయిలు నవీన్ రాజు స్వామి నాయకులు పాల్గొన్నారు.