జనం న్యూస్/ గంభీరావుపేట జనవరి 19 గంభీరావుపేట మండల కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల నాయకులు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడె రమేశ్ మాట్లాడుతూ 625 కోట్లు ఖర్చు చేసి 2.0 ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలో 25 లక్షల మంది ఆడపడుచుల కళ్ళలో వెలుగులు నింపడానికి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టడంతోపాటు గతంలో 10.58 కోట్ల మంది అర్హులైన మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ పంపిణీ చేయడంతో పాటు వారికి 300 రూపాయలు సబ్సిడీని అందిస్తున్నటువంటి భారత ప్రధాని విశ్వ గురువు నరేంద్ర మోడీకి గంభీరావుపేట మండల శాఖ పక్షాన మరియు ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మహిళలు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ ఆడెపు రవీందర్ సర్పంచులు ముస్తఫా నగర్ బండ సుకన్య దేవయ్య, పొన్నాల మహేష్ ఉపసర్పంచ్ నవీన్ కుమార్ నాయకులు దేవేందర్ యాదవ్ దేవసాని కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ పత్తి స్వామి రాజు నర్సింలు డాక్టర్ సత్యనారాయణ సర్వోత్తమ్ కృష్ణ కాంత్ రాజు మహేష్ దుర్గేష్ దేవేందర్ యాదవ్ నర్సింలు బాలయ్య రాజిరెడ్డి దేవరాజు రాకేష్ నారాయణ ఎల్లం రవీందర్ శ్రీనివాస్ చారి చంద్రం యాదవ్ రాజు రవీందర్ నాయక్ నవీన్ నవీన్ రాజు నాయకులు పాల్గొన్నారు.
