పొగ మంచుతో అనేక ఇబ్బందులు పడుతున్న అశ్వరావుపేట ప్రజలు

జనం న్యూస్ జనవరి 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం శివశంకర్ అశ్వరావుపేట నియోజకవర్గం లో తెల్లవారుజామున మొదలైన పొగ మంచు ఉదయం 11 సమయం అవుతున్న వీడని పొగ మంచు రహదారుల మీద అతి తీవ్రంగా పొగ మంచు పడటం వలన వాహనదారులకు అలాగే కాలినడకన వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు కనీసం రహదారి కూడా కనబడకుండా పొగ మంచు కురవడంతో ప్రధాన రహదారులలో భారీ వాహనాలు రోడ్డుకు ఇరువైపులా పక్కకు ఆపుకొని సూర్యుని రాక కోసం ఎదురుచూస్తున్నారు డ్రైవర్లు ఈ పొగ మంచు కారణంగా జీడి తోట రైతులు మరియు మామిడి తోట రైతులు కూడా భారీగా నష్టపోయే సూచనలు ఉన్నాయని రైతులు తెలిపారు