జనం పై దోమల దండయాత్ర..

జనం న్యూస్ 19 జనవరి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండలంలో ని సంత జుటూరు గ్రామంలో చీకటి పడితే చాలు జనం పై దోమలు దండయాత్ర చేస్తున్నాయి.. వీటి నివారణ చర్యలు అటకెక్కాయి. ఫాగింగ్ మరుగున పడింది.. ఫలితంగా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులకు కలగజేసే ప్రమాదం ఉంది. దోమలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.. సంబంధిత అధికారులు నివారణ చర్యలు, ఫాగింగ్ చేయడం వంటివి పట్టించుకో కపోవడంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సంబంధిత అధికారులు గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు..