జనం న్యూస్ ఉరవకొండ జనవరి 19 రిపోర్టర్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో దేవాంగ కుల ఆరాధ్య దైవం ఉరవకొండ ప్రసిద్ధిగాంచిన కోటలోని శ్రీ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఆదివారం దేవాంగ జ్యోతుల కమిటీ అధ్యక్షులు రెడ్డి నాగరాజు ఆధ్వర్యంలో దేవాంగ కుల పెద్దలు, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని పట్టణ పురవీధుల్లో భారీ ఊరేగింపుగా పుర ప్రజలకు, భక్తులకు అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల కమిటీ అధ్యక్షులు రెడ్డి నాగరాజు మాట్లాడుతూ ఈనెల 15 ,16 నా జరిగిన జ్యోతుల ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన భక్తులకు, దేవాంగ కుల సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా దీనితోపాటు ఇసు పోలీస్ ఇతర శాఖల అధికారులకు, అనధికారులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
