జనం న్యూస్ 19 జనవరి 2026 బండిఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: స్థానిక మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఆదివారం నాడు టిడిపి మండల కన్వీనర్ ముమ్మడి నాగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ముందుగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆరాధ్య దేవుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన మహనీయుడు అన్నారు. తెలుగు గంగను స్థాపించిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిపాటి నరసింహారెడ్డి, కంచర్ల మనోహర్ రెడ్డి, వెంగల్ రెడ్డి పేట శ్రీనివాసులు, బైరెడ్డి మధుసూదన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి,జాకీర్ ఖాన్ , చెన్నారెడ్డి,మల్లిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణ నాయక్, మద్దిగారి మదన భూపాల్, పాపయ్య, సుధాకర్, సాయిబాబా రెడ్డి, సుబ్బారెడ్డి, పాలనాగిరెడ్డి, మౌలిశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,బాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.