జనం న్యూస్ 19-01-2026 ప్రతినిధి శ్రీరమణ. నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం గుడిపల్లి మండలం లోని రాయినిపాలెం గ్రామానికి చెందిన బిల్లకంటి మీనయ్య నాగమ్మ దంపతుల కుమారుడు విష్ణు 21 సంవత్సరాలు చదువులో ముందుండేవాడు ఇతనికి వరుసగా మూడు ఉద్యోగాలలో కి ఎంపిక అయ్యాడు.ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఇండియా ఆర్మీ, అగ్నివీర్ జనరల్ డ్యూటీ గా,ఇటీవల ఐ టి బి పి ఉద్యోగానికి ఎంతో శ్రమించి ఎన్నికయ్యాడు, ఫిబ్రవరి లో ట్రైనింగ్ వెళ్తున్నాడు. విష్ణు చిన్న నాటి నుండి చురుకుగా ఉండేవాడు, గ్రామ ప్రజలు సంతోషాన్ని వక్తం చేశారు. విష్ణుని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని గ్రామ పెద్దలు చెప్పారు. విష్ణు తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.