జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బాల్య వివాహాల నిర్మూల గురించి అవగాహన : జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండల కేంద్రంలోని మహిళా సమైఖ్య భవనంలో శనివారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల ప్రోగ్రామ్ లో భాగంగా బాల్య వివాహాల నిర్మూల పైన సర్వీస్ ప్రొవైడర్స్ ( పురోహితులు, ఖాజీలు పాస్టర్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, టెంట్‌హౌస్ మరియు ప్రింటింగ్ ప్రెస్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ విజయ కుమార్ మరియు సిడిపిఓ హేమలత హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బాల్య వివాహాలు బాలల భవిష్యత్ కు అడ్డంకులని, బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితులలో ప్రోత్సహించ వద్దని తెలిపారు, ముఖ్యంగా పెళ్ళిల ఏర్పాటులో ముందుగా తెలిసేదే మీకు అని, మీరు పెళ్లి ఏర్పాట్లు చేసేముందు పిల్లల వయస్సు ముందే ధ్రువీకరించుకోవాలని సూచించారు, లేని పక్షంలో అట్టి బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారిగా శిక్షార్హులు అవ్వతారని హెచ్చరించారు, చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు మనమే కాలరాసినట్టు అవుతుందని తెలియజేయడం జరిగింది. పిల్లలందరూ కూడా బడిలో ఉండాలని పెద్దలందరికీ కూడా పనిలో ఉండాలని తెలియజేయడం జరిగింది, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని అందరూ కూడా అమలు చేయాలని, మరియు పిల్లలందరూ ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు తెలియజేయడం జరిగింది, బాల్య వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక లక్ష రూపాయలు జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఇవి రెండు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. బాల్య వివాహానికి సహకరించిన వారి పైన కూడా ఎఫ్ ఐ ఆర్ అవుతుందని తెలిపారు, పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్న 100,1098 కు కాల్ చేసి చెప్పండి అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమములో జిల్లా బాలల సంరక్షణ అదికారి నర్సింహా, బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్, ఎస్ఐ శేఖర్ గౌడ్, ఎంపీవో రవి, ఎంఈఓ నల్లారెడ్డి, ఏపీఎం దేవదాస్,, చైల్డ్ లైన్ సూపర్వైజర్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.