ఖమ్మం సిపిఐ మహాసభకు తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు

జనం న్యూస్ జనవరి 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్ ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శత వసంత మహాసభలను విజయవంతం చేసేందుకు అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా కదిలాయి. వివిధ మండలాల నుంచి సుమారు 2,000 మందికి పైగా కార్యకర్తలు, ప్రజలు ఖమ్మం బయలుదేరారు. వీరి కోసం పార్టీ నాయకత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ సభ ను విజయవంతం చేయడానికి లక్ష మందికి పైగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర సమైక్య సమితి అధ్యక్షులు సయ్యద్ సలీం టౌన్ సెక్రటరీ దేవరకొండ విజయ్ ఈటీవీ మండల అధ్యక్షులు జలాలి పటన్ శివశంకర్ మరియు సిపిఐ పార్టీ కార్యకర్తలు పరిసర ప్రాంత ప్రజలు కార్యక్రమాన్ని గణ విజయం చేయడానికి ముందుకు వచ్చారు