జనం న్యూస్, జనవరి 19, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ నివాసం లో జమ్మికుంట మండలం కోరపెల్లి గ్రామానికి చెందిన పల్లె కుటుంబ సభ్యులు పల్లె లవ్ కుమార్ గౌడ్, విజయలక్ష్మి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల కోరపెల్లి గ్రామంలో 11వ వార్డు మెంబర్గా గెలుపొందిన పల్లె నిఖిల గౌడ్ ని ఒడితల ప్రణవ్ ఘనంగా సన్మానించారు. ప్రజల విశ్వాసంతో గెలిచిన నిఖిల గౌడ్ గ్రామ వార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. గ్రామ స్థాయి నాయకులు ప్రజాసేవ పట్ల నిబద్ధతతో పని చేయడం అభినందనీయమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఒడితల ప్రణవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
