ఎన్టీఆర్ కు ఘన నివాళులు..

జనం న్యూస్ జనవరి 19 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు భూదేవిపేటలో ఉన్నటువంటి ఆయన విగ్రహం వద్ద నాయకులు కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసినటువంటి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరవరపు అశోక్, శాఖమూరి సంజీవులు, కొమ్మన వెంకటేశ్వరరావు, పసుపులేటి లక్ష్మయ్య, నూపా శ్రీరాములు, గొంది నాగేశ్వరరావు, కట్టం రాంబాబు, కురుమేళ్ళ సుధాకర్, కోటిపల్లి ముత్యాలరావు, చాపర్ల శ్రీను, రాజులు,కరటూరి రాధాకృష్ణ, దొరబాబు ,సలీం, కుకునూరు సత్తిబాబు రాంబాబు, అమరవరపు వెంకన్న, బేతి శ్రీను, అనిల్, రామారావు తదితరులు పాల్గొన్నారు