ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు అసలేం జరుగుతుంది.

★ మానసికంగా కృంగిపోతున్న జేఎల్ఎంలు. ★ ఏళ్ల తరబడి ఒకే చోట విధుల నిర్వహణ. ★ బదిలీలు చేపడితే ఒత్తిళ్లు అధికమించి , బాధ్యతలపై మరింత దృష్టి పెడతామ్

జనం న్యూస్ 19 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తుండడంతో మానసికంగా, కుటుంబ పరంగా ఎన్నో అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ విధులు నిర్వహిస్తున్నామని బదిలీలు చేపడితే ఓత్తిళ్లను అధిగమించి బాధ్యతలపై మరింత దృష్టి పెడతామని పెడతామని జూనియర్ లైన్మెన్లు, అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్లు వాపోతున్నారు.ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో సుమారు 2400 మంది,నిజామాబాద్ జిల్లాలో 250 మంది జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్ లు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులను పట్టించుకునే వారే కరువయ్యారు.విద్యుత్ శాఖలో గతేడాది జేఎల్ఎం(జూనియర్ లైన్మెన్)లకు ఏఎల్ఎం(అసిస్టెంట్ లైన్ మెన్)లుగా పదోన్నతి కల్పించారు. అయితే వారిని ఇతర స్థానాలకు పంపకుండా ఉన్న చోటునే కొనసాగిస్తున్నారు. 2019 జేఎల్ఎంలుగా ఎంపికైన కొంతమందికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పట్లో వారు సంతోషంగా విధుల్లో చేరారు. సాధారణంగా శాఖలో ఏ ఉద్యోగులకైనా సాధారణ బదిలీలు చేపడ తారు. వీరిని మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కదిలించలేదు. పలుమార్లు ఉన్నతాధి కారులకు విన్నవించుకున్నా స్పందన లేదు. 2024లో ఏఎల్ఎంగా పదోన్నతి కల్పించిన సమయంలో నిబంధనల ప్రకారం ఇతర ప్రాంతాలకు పంపాలి. నిబంధనను పక్కన పెట్టి ఇన్నాళ్లూ యథా స్థానంలోనే వారిని కొనసాగిస్తున్నారు. కొత్త స్థానంలో పోస్టింగ్ ఇస్తే ఒత్తిళ్లు తగ్గి, బాధ్యతలపై మరింత దృష్టి పెడతామని ఏఎల్ఎంలు చెబు తున్నారు. అధికారులు స్పందించి సాధారణ బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. 2022లో నిజామాబాద్, డిచ్ పల్లి రెండు డివిజన్లుగా బైఫర్ కేషన్ చేయాలని ఉన్నత అధికారుల నుంచి మార్గదర్శకాలు వచ్చినప్పటికీ ఎలాంటి బైఫర్ కేషన్ చేయకుండా సంస్థ ఉన్నతాధికారులు తాత్చారం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి రాబోయే సాధారణ బదిలీలలో జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్ లను బదిలీలు చేయాలని వారు కోరుకుంటున్నారు.