జనం న్యూస్ జనవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి జాతీయ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా దేశ రాజకీయాలు నడిపిన మహా మనిషి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 31 వర్ధంతి కార్యక్రమాన్ని అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలుగుదేశం అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పిలా గోవింద సత్యనారాయణ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 84వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు కాయల మురళి తదితరులు పాల్గొన్నారు.